ఉపాధి అవకాశాలను యువత వినియోగించుకోవాలి
జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్.
అగ్నిధారన్యూస్,పెద్దపల్లి , నవంబర్ -04
ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువతీ, యువకులు వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మెడ్ ప్లస్ కంపెనీ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.వివిధ ప్రాంతాల అభ్యర్థులు ధృవ పత్రాలతో పాల్గొన్నారని, కంపెనీ ప్రతినిధులు ఎంపిక విధానం , ఉద్యోగం గురించి వివరించి ఇంటర్వ్యూలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి కల్పన అధికారి సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మెడ్ ప్లస్ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

