అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాత ఎంపీడీవో ఆఫీస్ అంటే ప్రజలకు ప్రయాణికులకు నాయకులకు సొంత ఇంటితో సమానం.. ఏళ్ల తరబడి ఈఆఫీస్ తో ఈ ప్రాంత ప్రజలకు విడదీయరని సంబంధం.. పక్కనే ఆర్టీసీ బస్టాండ్ ముందు ఐటిఐ కాలేజ్ ఈ పక్కన రైల్వే స్టేషన్ విశాలమైన ప్రాంతంలో పెద్దపల్లి మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నిర్వహించబడేది.. ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయ స్థలాన్ని పెద్దపల్లి ఆర్టీసీ డిపోకి ప్రభుత్వం సంవత్సర కాలం క్రితం అప్పగించింది. ఇందులో ఎంపీడీవో ఆఫీస్ తో పాటు ఎక్సైజ్ శాఖ కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, భవిత, పంచాయతీరాజ్, ఈజీఎస్, టాస్క్ కార్యాల యాలు ఉన్నాయి. ఆర్టీసీ డిపో కి అప్పగించిన నుండి, సంవత్సర కాలంగా ఆడిందే ఆట పాడింది పాట అన్న చందంగా ఆయా కార్యాలయాల ప్రాంగణంలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే చర్చ జరుగుతుంది. నిత్యం మందు సీసాలు మద్యం బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ, సెక్యూరిటీ లేకపోవడంతో, కార్యాలయానికి రక్షణగా ఉన్న ఇనుప గేట్లు దొంగల పాలయ్యాయి. రెండు రోజుల క్రితం వరకు ఎంపీడీవో ప్రధాన కార్యాలయంలో ఉన్న జాలీలు దొంగల పాలు కావడంతో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా కార్యాలయాలలోని వందలాది క్వింటాళ్ల విలువచేసే స్క్రాప్ దొంగల పాలైనట్లు సమాచారం. అంత ధైర్యంగా స్క్రాప్ దొంగతనాలు పాల్పడుతున్న వారికి ఎవరి అండదండలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఎంపీడీవో కార్యాలయ ప్రధాన గేటు తో సహా, విలువైన వస్తువులు దొంగల పాలైనట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా  అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.       కార్యాలయ భద్రతకు  గోడకు ఉన్న జాలి         దొంగల పాలైన ఇనుప  జాలి ..                  ప్రధాన గేటు