మండల వ్యవసాయ అధికారి నరేందర్
అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ :
మహమ్మదాబాద్ మండల్ లో ఇటీవలి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారి నరేందర్ పర్యటించి వరి, వేరుశనగ పంటలను పరిశీలించారు. ఇప్పటివరకు దాదాపు 40 ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా బయటకు పంపాలని, కిందపడిన వరిని కట్టలుగా కట్టుకోవడం వల్ల గింజ నాణ్యత దెబ్బతినదని రైతులకు సూచించారు. కోతకు సమయం ఉన్న వరిలో తెగుళ్ల నివారణకు 2 గ్రాముల సాఫ్ మందును పిచికారి చేయాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటపై 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేస్తే మొలక శాతం తగ్గుతుందని వివరించారు. రైతులు ఎలాంటి సమస్యలు వచ్చినా వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.
