నవీన్ యాదవ్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
అగ్నిధార న్యూస్ (కల్వకుర్తి)
హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, ఉప ఎన్నికలలో భాగంగా చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించిన తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శతాబ్ది టౌన్ షిప్ చైర్మన్ కాసు శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మంగ్లీ రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యట నరసింహ,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బూత్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
