అగ్నిధార పెద్దపల్లి జిల్లాలో గ్రంధాలయలు అభివృద్ది చేసేందుకు ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా గ్రంథాలయాల సంస్థ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు 2021-22 సంవత్సరానికి సంబంధించిన సంచాలకులు వారు ఆమోదించిన బడ్జెట్ నిబంధనలు మేర ఖర్చు చేయుటకు సమావేశం అనుమతించింది. 2021-22 సంవత్సరంలో రూ.70 లక్షలతో నూతన గ్రంథాలయ నిర్మాణానికి 70 లక్షలు మంజూరు చేసినారు, పెద్దపల్లి గ్రంథాలయంలో పాఠకులు ఎక్కువగా వస్తున్నందున , అదనంగా గదులు నిర్మాణం చేయుటకు అంచనాలు తయారు చేయించి పరిపాలనా ఆమోదాన్ని మొత్తం సంచాలకుల వారికి సమర్పించుట సమావేశం నిర్ణయించింది. ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. గ్రంథాలయ సెక్రటరీ సరిత , గౌరవ సభ్యులు గుడిసే గట్టయ్య, ఇజ్జగిరి రాజు,ఎక్స్ ఆఫిసియో సభ్యులైన జిల్లా పంచాయతీ అధికారి , జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి వయోజన విద్య శాఖ అధికారి జయశంకర్జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం ప్రతినిధి, పాల్గొన్నారు
