జగిత్యాల,అగ్నధారన్యూస్:కొడిమ్యాల మండల కేంద్రం లోని చిలుక వాగు కోతకు గురికాకుండా చెరువు నుండి వచ్చే నీరు మరియు డ్రైన్ నుండి వచ్చే నీరు సాఫీగా పోవడానికి కొరకై గైడ్ వాల్ నిర్మించాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకెరవిశంకర్ ను కొడిమ్యాలMppమేనేని స్వర్ణలత రాజనర్సింగారావు ZPTC పునుగోటి ప్రశాంతి కృష్ణారావు  కోరగా వెంటనే స్పందించిన చొప్పదండి MLA సుంకే రవిశంకర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ కన్నా, వర్క్ ఇన్స్పెక్టర్ గంగాధర్ లు సంబధిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్,కొ ఆప్షన్ సభ్యులు నసీరొద్దీన్, తెరాస మండల అధ్యక్షులుపులివెంకటేష్,గౌడ్,రైతుబంధుసమితిఅధ్యక్షులుఅంకంరాజేశం ,SCసెల్ మండల అధ్యక్షులు నేరెల్ల మహేష్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ శుకూర్, తెరాస మండల ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రభుదాస్ తదితరులు ఉన్నారు.