అగ్నిధార న్యూస్( పెద్దపల్లి ):శనివారం రోజు. దళిత భవన్ ట్రస్టు సభ్యులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను తన కార్యక్రమంలో కలసి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు దాసరి కిషన్. దళిత భవన్ ఆవశ్యకత గురించి మంత్రికి తెలియజేశారు. అన్ని పుణ్యక్షేత్రాలలో దళిత భవన్ ఏర్పాటు చేయుట గురించి తెలిపారు. కాగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు దళిత భవన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత భవన్ , ఉపాధ్యక్షులు బొంకూరి కైలాసం, వర్కింగ్ ప్రెసిడెంట్ కాశి పాక వాసు, జనరల్ సెక్రెటరీ పెరుక వంశీకృష్ణ, కోశాధికారి కల్వల సంపత్, సభ్యులు కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు,
