అగ్నిధారన్యూస్ గోదావరిఖని : నేడు స్థానిక స్నేహసాహితి గ్రంధాలయంలో తెలంగాణ జాగృతి జిల్లా అధికార ప్రతినిధి,ప్రముఖ కళాకారులు అందె సదానందం  చేతులమీదుగా బాలసాని నరేష్ దర్శకత్వంలో హీరోగా అమేజింగ్ స్టార్ అశోక్ వేముల మరియు హీరోయిన్ గా రితిక, నటినటులుగా బొడ్డు జగన్, మేకల శ్రీకాంత్ యాదవ్, దామెర రాజేష్,సోగాల వెంకటి, జ్యోతి,దీప్తి, సదకుమార్, రహీం, రమేష్, కెమెరామెన్ నాయిని బాలు,మెకప్ మెన్ అంజి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అందె సదానందం క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డ్రైవర్ సాబ్ సినిమా సందేశాత్మక చిత్రం అని యువత చిన్న చిన్న అవసరాల కోసం చెడు దారిన పడుతున్నారని వ్యసనాలకు బానిసై నేరాలు చేస్తూ కటకటాల పాలయితున్నారని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఇటువంటి అంశాలను ఇతివృత్తముగా తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారని ఈ సందర్భముగా సినిమాను రూపొందిస్తున్న అమేజింగ్ స్టార్ వేముల అశోక్ ని అభినందించారు. సమాజహితం కోసం ఇటువంటి సినిమాని తీసుకున్నామన్నారు.