వ్యాపారస్తుల కి కౌన్సిలింగ్  నిర్వహిస్తున్న ఏ సి పి సారంగపాణి

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లాలోని   పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి ఏ సి పి సారంగపాణి మరియు  మున్సిపాలిటీ హెచ్ కె ఆర్ సంయుక్తంగా, నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో, భాగంగా రోడ్డుకిరువైపులా ఆక్రమిత  ప్రాంతంలో  వ్యాపారం చేస్తూ,   వ్యాపార వస్తువులను, వారి షాపుల ముందు ఉంచడం ద్వారా   రోజురోజుకు పెరుగుతున్న, జన సముదాయం దృశ్య, పట్టణంలోని  రోడ్లన్నీ, జన సమూహాలతో వాహనదారుల తో, రోడ్డుకిరువైపులా తినుబండారాలు,  షాపులు, టీ స్టాల్స్ ,హోటల్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో, ప్రధాన కూడళ్ళలోనే కాకుండారాజీవ్ రహదారికి ఇరుపక్కల వ్యాపార సముదాయాలతో, వచ్చిపోయే జనంతో, ఆయా ప్రాంతాలు కిటకిటలాడుతుంది. అదేవిధంగా పెద్దపల్లిలో రోజురోజుకి ప్రమాదాలు సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రజల సౌకర్యార్థం ఎసిపి సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్ ,ఎస్సై రాజేష్,లు వ్యాపారం చేసే వారితో ఈరోజు 12 మధ్యాహ్నం గంటల నుండి  వ్యాపారస్తులకు,షాపుల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించడంతోపాటు, సత్వరమే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమిత వ్యాపార సముదాయాలను తొలగించాలని ఆదేశించారు. లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ  రాజ వర్ధన్ ఏపీఎం హెచ్ కెఆర్ నవీన్ కుమార్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్ తో పాటు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.