అగ్నిధార న్యూస్ ( నస్పూర్ ):శనివారం రోజు శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ ఆర్ పి 3 గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల.రాజారెడ్డి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కొరకు ఈ నెల 28 29 న జరుగుతున్న సమ్మెను బొగ్గుగని కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్మికుల సీఎం పిఎఫ్ వడ్డీ రేట్లు సరి చేయడంలో సిఐటియు ప్రధాన పాత్ర పోషించిందన్నారు. అంతే కాకుండా క్వార్టర్ ఉన్న కార్మికులు ఆదాయపన్ను ఎక్కువగా చెల్లిస్తున్నారని గమనించిన సీఐటీయూ దిగి పోయినప్పుడు ఎవరి క్వార్టర్ వారికే ఇవ్వాలనే, ఉద్దేశ్యంతో కార్మికులకు సొంత ఇంటి పథకం నెరవేర్చడానికి తాను నిరాహార దీక్ష సైతం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ,ఆ అంశాన్ని సమ్మె అజెండాలో చేర్చడం వలన ఆగామని ఈ నెల 16న జరిగే సమావేశంలో చర్చలు విఫలమైతే కార్మికులకు సొంత ఇంటి పథకం కోసం అమలు చేసేవరకు ఆమరణ నిరాహార దీక్ష చేశైనా కార్మికులకు అమలు చేయిస్తామన్నారు. ఆదాయ పన్ను ఎక్కువగా కడుతున్న కార్మికులకు కోలిండియా ఒప్పందం ప్రకారం అలవెన్సులు మీద ఐటి మాఫీ చేయమంటే యాజమాన్యం మెండికేస్తుందన్నారు. కార్మికుల సెప్టిని యాజమాన్యం పట్టించుకోవడంలేదని రక్షణ కమిటీలలో సీనియర్ కార్మికులకు అవకాశం కల్పించాలని, ప్రమోషన్లలో సీనియర్ కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. సింగరేణిలో వేలంలో పెట్టిన బ్లాక్లను తిరిగి పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనియన్లను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేయాలని తెలిపారు.సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేస్తేనే భవిష్యత్తులో సంస్థను కాపాడుకోగలమని అందుకే అన్ని యూనియన్లను కలుపుకొని పోయి సమస్యలపై నిక్కచ్చిగా పోరాడే సిఐటియును ఆదరించాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, గోదారి.భాగ్యరాజు, కస్తూరి.చంద్రశేఖర్ సాంబమూర్తి,ఎస్.వెంకట స్వామి,రామస్వామి,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
