✍️✍️ చేగొండ రవికుమార్ యాదవ్
■ ప్రగతి భవన్ సాక్షిగా మాట ఇచ్చారు.
■ మా జీవితాలలో వెలుగు నింపండి జీవితాంతం రుణపడి ఉంటాం.
■ మేము మీ పిల్లలమే కనికరించండి.
■ రాష్ట్రంలో అందరికీ న్యాయం చేస్తున్నారు మాకున్యాయం చేయండి.
■ అర్హత పరీక్షలు రాద్దామంటే వయోపరిమితి దాటింది.
■ అప్పటి కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసిన ప్రయోజనం శూన్యం.
■ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షర భారత్ కోఆర్డినేటర్లు ముఖ్యమంత్రి ని వేడుకుంటున్నారు.
అగ్నిధార న్యూస్ ( డెస్క్ న్యూస్ ):వయోజన విద్య శాఖ ..1978 సంవత్సరంలో స్థాపించబడింది, 15 ఏళ్లు పైబడిన స్త్రీ పురుషులకు చదువుని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. నేటి వరకు వివిధ పేర్ల తో కార్యక్రమాన్ని వయోజన విద్య శాఖ కొనసాగిస్తుంది. …..నేడు ఆ శాఖ సార్వత్రిక విద్యా శాఖగా రూపాంతరం చందా పోతుంది…… ఇంతవరకు బాగానే ఉంది. 1978 నుండి 2022 వరకు వయోజన విద్య కార్యక్రమాలలో వేలాది మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమ లక్ష్యం నెరవేరడానికి అహర్నిశలు కృషి చేశారు….. నాటి ఆంధ్ర పాలకులు……. 1996 నుండి నిరంతర విద్యా కేంద్రాల పేరుతో ఈ కార్యక్రమంలో పనిచేసే ప్రేరక్ లే ఆయా గ్రామాలలో వేలాది రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి, ఈ కార్యక్రమంలో పుష్కర కాలం భాగస్వాoలైనారు. కారణం ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తుందని ఆశతో పని చేశారు. నిరంతర విద్య కార్యక్రమం మంగళం పాడక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి డబ్బులు రాక నేటికి రాష్ట్రంలో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. 2007 సంవత్సరంలో నిరంతర విద్యా కార్యక్రమం ముగిశాక, 2009 సంవత్సరంలో ( కాంగ్రెస్ ) కేంద్ర ప్రభుత్వం, సాక్షర భారత్ కార్యక్రమం పేరుతో కొత్త పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకు వచ్చింది.
75 శాతం కేంద్ర నిధులు 25 శాతం రాష్ట్ర నిధులతో కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో 443 మండలాలలో 443మండల కో– ఆర్డినేటర్ లను 8963 గ్రామ పంచాయతీలలో గ్రామనికి 2 గ్రామ కో– ఆర్డినేటర్ లను ఫుల్ టైం కాంట్రక్షవెల్ పద్ధతిన మండల స్థాయిలో ఎంసిఓ కి డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంపీడీవో కన్వీనర్, ఎంపీపీ చైర్మన్, మండల కమిటీ చేత. గ్రామస్థాయిలో , విసిఓ కి ఎస్ ఎస్ సి పాసై ఉండాలి. పంచాయతీ కార్యదర్శి కన్వీనర్, సర్పంచ్ చైర్మన్, గ్రామ కమిటీ చేత. మండలానికి ఒక ఎంసిఓ ను గ్రామానికి ఇద్దరు విసిఓ లను కమిటీలు నియమించాయి. మండల స్థాయిలో పనిచేసే మండల కో ఆర్డినేటర్ కి అతి తక్కువ వేతనం అయినా 6000 ల రూపాయలు గ్రామ స్థాయిలో పని చేసే గ్రామ కో ఆర్డినేటర్ కి 2000 ల వేతనంగా నిర్ణయించారు.
మండల పరిధిలోని ఆయా గ్రామాలలో 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులైన అందరికీ అక్షరాస్యత కార్యక్రమం అందించడంతోపాటు, చదివింది మర్చిపోకుండా ఉండడం కోసం ఎన్ ఐ ఓ ఎస్ పరీక్షలు, పెట్టి ఉన్నత విద్యను అందించడం, వృత్తి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, వయోజన విద్యా కేంద్రంలో, గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించడం ,ఈ కార్యక్రమంలో భాగం. మండల,గ్రామ స్థాయిలో పనిచేసే మండల,గ్రామ కో ఆర్డినేటర్ సాక్షర భారత్ కార్యక్రమాలు మండలంలో సజావుగా జరిగేలా చూసుకుంటూనే, ప్రభుత్వం తీసుకునే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి పని చేశారు. మండలంలోని ఒక గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ,మన ఊరు, మన ప్రణాళిక ,హరితహారం, ఉపాధి హామీ పథకం పనులు ,వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ, ఇంటి పన్ను వసూల్, కార్యక్రమాలతోపాటు, ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పిటిసి ,ఎంపీటీసీ ,సర్పంచ్ ,ఎన్నికల నిర్వహణలో ఎంసిఓ విసిఓ లందరూ అవిరామంగా విధులు నిర్వహించారు . మండల స్థాయిలో ,ఎంపీడీవో కి ఎంసిఓ, ,గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి కి విసిఓ, అనుక్షణం అభివృద్ధి పనులలో నీడలా ఉండి పని చేశారు. అనేది నగ్నసత్యం. మండల స్థాయిలో పనిచేసే మండల కోఆర్డినేటర్లు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ శిక్షణ కేంద్రంలో మిషన్ భగీరథ ,సర్పంచులకు ,వార్డు నెంబర్లకు, ఐ ఎస్ ఎల్, నిర్వహణలపైనా అనేకమార్లు శిక్షణ పొంది మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో 45 రోజుల సకల జనుల సమ్మెలో పాల్గొని ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించడంలో మండల గ్రామ కోఆర్డినేటర్ లు చాలా కీలక పాత్ర వహించారు. తొమ్మిది సంవత్సరాల పాటు సాక్షర భారత్ కార్యక్రమంతో పాటు మండలంలో ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సాక్షరభారత్ కోఆర్డినేటర్లు నిర్వహించిన పాత్ర వెలకట్టలేనిది. అతి తక్కువ వేతనంతో అన్నీ తామై పనిచేసిన కోఆర్డినేటర్ లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేస్తాయి అనుకుంటే ,అన్యాయమే చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పనిచేసే కోఆర్డినేటర్లు చాలావరకూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు చెందిన బడుగు, బలహీన ,వర్గాల పేదవారు ఉండడం గమనార్హం .చాలామంది కోఆర్డినేటర్లు మంచి ఉన్నత విద్యను పొంది పి జి, బీఈడీ కలిగి ఉండడం, ఇక్కడ చెప్పదగిన విషయం. ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగ భద్రత కలిగి ఉంటుందని ఎదురుచూసిన వారిలో మండల గ్రామ కోఆర్డినేటర్లు ఉన్నారు” . పెరగని వేతనాలు తొమ్మిది సంవత్సరాల కాలంలో సాక్షర భారత్ లో పనిచేసే మండల ,గ్రామ కోఆర్డినేటర్ లకు ఒక్క రూపాయి వేతనo పెరగలేదంటే అతిశయోక్తి కాదు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కుటుంబాల నెట్టుకు వస్తూ ,సాక్షర భారత్ కార్యక్రమాలతోపాటు , ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు .కారణం పథకం కేంద్రంగా అయినా తెలంగాణ వచ్చింది, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అందరి బాధలు తెలిసిన వ్యక్తి, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశతో ఉన్నారు. టీఎన్జీవో సంఘం నీడలో…
సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేసే మండల, గ్రామ, కోఆర్డినేటర్లు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వ్యతిరేకంగా ఏనాడు వెళ్లలేదు . అది కాకుండా కరీంనగర్ లో 2017లో వేలాది మందితో నిర్వహించిన భారీ బహిరంగ సభకు నాటి టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను ,టీ ఎన్జీవో నాయకులను, మాత్రమే ఆహ్వానించడం ప్రభుత్వ అనుకూలతకు సంకేతాలు. సమావేశానికి హాజరైన నాటి మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ , ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎన్జీవో నాయకులు కారం రవీందర్రెడ్డి, మామిండ్ల రాజేందర్ మాట్లాడుతూ మీ న్యాయమైన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ సాక్షిగా న్యాయం చేస్తాం అన్న ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ ఇవ్వడానికి, శిక్షణ పొందుటకై , వివిధ జిల్లాల నుండి ఎంపీడీవో లతోపాటు, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు.ఫిబ్రవరి 6 2019 రోజున ప్రగతిభవన్ లో అట్టి కార్యక్రమానికి హాజరైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి ,సాక్షర భారత్ కోఆర్డినేటర్లు ఎదుర్కొంటున్న సమస్యను వేతనాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అనే విషయం బాధాతప్త హృదయంతో కోఆర్డినేటర్లు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వారం రోజుల్లోపు మీ అందరికీ తీపి కబురు చెబుతానన్నారు. పక్కనే ఉన్న దేశపతి శ్రీనివాస్ కి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కు, ఈ విషయమై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కానీ నేటికీ నెరవేరకపోవడం బాధాకరం అని మండల కోఆర్డినేటర్లు మదన పడుతున్నారు.ఉన్నత విద్యలు చదివి సాక్షర భారత్ లో, పనిచేసి ఎలాంటి ఉద్యోగ పరీక్షలకు అర్హత లేకుండా, వయో పరిమితి మించి, దిక్కుతోచని స్థితిలో చాలామంది కోఆర్డినేటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. నాడు మండలంలో గ్రామంలో ఉద్యోగాలుగా ఒక వెలుగు, వెలిగి ,నేడు కూలిగా, మారి దయనీయ పరిస్థితిలో సాక్షరభారత్ కోఆర్డినేటర్లు ఉన్నారు. రాష్ట్రంలో ఎందరికో న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి మాకు కూడా ఇప్పుడు వచ్చిన సార్వత్రిక విద్య నవ సాక్షర భారత్ కార్యక్రమంలో గాని ఇంకా ఏదైనా ఈ కార్యక్రమంలో గాని నియమించి అన్ని కుటుంబాలలో వెలుగు నింపుతారు అని సాక్షర భారత్ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.
