అగ్నిధార న్యూస్:బుధవారం ఉదయం షిప్టులో KK-5 గని పై 28,29 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బొగ్గు బావుల్లో ప్రైవేటీకరణను విరమించుకోవాలనే డిమాండ్ తో పాటు సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యలైన అలవెన్సులపై ఐటీ మాఫీ చేయాలని, దిగి పోయినప్పుడు ఎవరి కోటర్ వారికి ఇచ్చి సొంతింటి పథకం అమలు చేయాలని, 11వ వేతన ఒప్పందాన్ని త్వరగా పరిష్కరించాలని, ప్రమాదంలో మృతి చెందిన శాశ్వత,కాంట్రాక్టు కార్మికులకు కోటి రూపాయల పరిహారం అందజేయాలనే డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును మేనేజర్ SOM భూశంకరయ్య గారికి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు వెంకట స్వామి, పిట్ నాయకులు ప్రవీణ్,సంజీవ్, వెంకటేష్ లు పాల్గొన్నారు.
