అగ్నిధార న్యూస్:బుధవారం ఉదయం షిఫ్ట్ లో కేకే ఓసి లోని సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ జ.సెక్రెటరీ కామ్రేడ్ నాగరాజు గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలలోని వాటాలను ఉపసంహరించుకుంటూ త్వరితగతిన ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని దేశ వ్యాప్తంగా ఈనెల 28,29 న సింగరేణి కార్మికులు కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే విమానయానం, రైల్వే, LIC వంటి పరిశ్రమల్లో వాటాలు ఉపసంహరించుకుంటూ లాభాల్లో కొనసాగుతున్న కోల్ ఇండియా, సింగరేణి వంటి సంస్థల్లో ఉన్న గనులలో సైతం ప్రైవేట్ వారికి టెక్నాలజీ పేరిట అప్ప చెబుతూ భవిష్యత్తులో పర్మనెంట్ కార్మికులు లేకుండా చేస్తున్నారని, తాజాగా కార్మికులు కష్టపడి దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ లో నుండి హౌసింగ్ లిమిటెడ్ కంపెనీలకు లోన్లు ఇచ్చి ఆ సంస్థకు నష్టం వచ్చిందని వారికి మాఫీ చేయాలని చూస్తున్నారని అంతేకాకుండా CMPF వడ్డిని సైతం ఎన్నడూ లేని విధంగా అతి కనిష్ట స్థాయికి 8.1% కు తగ్గించి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశారన్నారు. చివరికి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచేలా గనులను లిజ్ కిచ్చే CBA చట్టాన్ని కూడా మర్చారన్నారు.స్వంత పైరవీలు కాకుండా అన్ని యూనియన్లు కలిసి ఐక్య పోరాటాలతో కార్మికులకు ఉన్న హక్కులను కాపాడాలని అన్నారు. సింగరేణిలో కూడా కోల్ ఇండియా మాదిరి కార్మికులకు అలవెన్సుల మీద ఐటీ మాఫీ చేయడం లేదని, దిగిపోయే కార్మికులకు ఎవరి క్వార్టర్ వారికే ఇవ్వాలని ఇంకా మరికొన్ని అపరిష్కృత సమస్యలను జతపరుస్తూ KK-OC మేనేజర్ గారికి సమ్మె నోటీస్ ను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి అల్లి.రాజేందర్.,ఫిట్ సెక్రెటరీ రాయమల్లు,ఆరిఫ్, మరియు కార్మికులు పాల్గొన్నారు.
