అగ్నిధార ప్రతినిధి జీవన్
■ సీఎం పిఎఫ్ సొమ్మును కాజెసేందుకు పెట్టుబడిదారుల కుట్రను ఖండిస్తున్నాము- సిఐటియు.
■ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రధాన సూత్రధారులు మంద నరసింహారావు వెల్లడి.
అగ్నిధారన్యూస్ ( మంచిర్యాలజిల్లా )ఆదివారం రోజు ఐటియు జె బి సి సి ఐ సభ్యులు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు మందా.నరసింహారావు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి…
వేల కోట్ల రూపాయల కార్మికుల సీఎంపిఎఫ్ ఫండును కాజేసేందుకు అనేక,సంస్థలు కుట్ర పన్నుతున్నాయని అందులో భాగంగానే దాదాపు సీఎంపిఎఫ్ డబ్బులను దాదాపు రూ.1006 కోట్ల పెట్టుబడులు దివాళా తీసిన అంశం ఈ మధ్య జరిగిన ట్రస్టులో చర్చకు వచ్చిన సందర్భంగా, దీనిపై నిజానిజాలు బయటకు వచ్చేందుకు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ట్రస్ట్ బోర్డు ప్రధాన సూత్రధారులు కారకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు పూర్తిస్థాయి సిబిఐ విచారణ నిర్వహించి ఆ డబ్బును రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేయటం ద్వారా సీఎంపిఎఫ్ సొమ్ముకు రక్షణ ఉంటుందని లేకపోతే ఇలాంటి దొంగ సంస్థలు అనేక కార్మికులు కష్టపడి కూడబెట్టిన డబ్బుకు భవిష్యత్తు లేకుండా చేసేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని . దీని వెనకాల అనేక తిమింగళాలు దాగి ఉన్నాయని వారిని కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కాబట్టి సీబీఐ తో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి సీఎంపిఎఫ్ డబ్బులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని మంద నరసింహారావు డిమాండ్ చేశారు.
