అగ్నిధారన్యూస్ ( గోదావరిఖని ): రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన తంగళ్లపల్లి విష్ణువర్ధన్(15) సోమవారం ఓసీపీ 2 సింగరేణి కాలువలో పడి మృతి చెందాడు.స్థానిక కాకతీయ పాఠశాల లో విష్ణువర్ధన్ పదవ తరగతి చదువుతున్నాడు.శ్రీరాంసాగర్ నీటిని వదలగా నాగేపల్లి-రత్నాపూర్ శివారులో తవ్వుతున్న ఓసీపీ 2 ఓబి ప్రక్కన కెనాల్ అడ్డుగా మారటంతో నీరు వెనుకకు తన్ని కాకతీయ పాఠశాలలోకి చేరటంతో సెలవు ఇవ్వటం జరిగింది.సెలవు కావటంతో తోటి విద్యార్థులతో విష్ణువర్ధన్ కాలువ వద్దకు వెళ్లినట్లు సమాచారం.కాలువలో పడగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ విద్యార్థిని బైటకు తీసి సెంటినరీ కాలనీ డిస్పెన్సరీకి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలియగానే కొందరు సింగరేణి అధికారులు క్యాంపర్ వాహనం లో నిషిద్ద ప్రాంతం బోర్డులు వేసుకొని ఈ ప్రాంతం లో పాతడానికి రాగా స్థానికులు అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ రక్షణ చర్యలు చేపట్టాకపోవడంతోనే విష్ణువర్ధన్ మృతి చెందాడని ఎంపీపీ ఆరెల్లి దేవక్కకొమురయ్య, సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, ఉపసర్పంచ్ దుబ్బాక సత్యారెడ్డి,వార్డు సభ్యుడు బొంగురాల రవి, తెరాస నాయకులు బూర్గు రాజు గౌడ్, సందెవేన కుమార్ ఆరోపించారు. కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలనీ స్థానిక ఎస్ఐ కటికే రవిప్రసాద్ ను కలిసి కోరారు.
