అగ్నిధారన్యూస్ ( నస్పూర్ )మంగళవారం రోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెబిసిసిఐ సభ్యులు మంద నరసింహారావు మాట్లాడుతూ……సింగరేణిలో మేనేజిమెంటు కార్మికుల సర్వీసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచి అన్ని బెనిఫిట్స్ అమలు చేస్తానని సర్క్యులర్ జారీ చేసింది, అలాగే చట్టంలో   రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో సూపర్న్వేషణ్ అని చెప్పిందే తప్ప 60 కాని 61 సంవత్సరాలు  ఎక్కడ చట్టంలో తెలియజేయలేదు అన్నారు. కానీ సీఎం పిఎఫ్ మరియు పెన్షన్ గాని 61 సంవత్సరాలకు పరిగణలోకి తీసుకోకుండా కేవలం 60 సంవత్సరాలకు పరిగణలోకి తీసుకొని లెక్కించటం వల్ల అదనంగా చేసిన ఒక సంవత్సరానికి గాను నష్టాన్ని కలగ చేస్తున్నది. అలాగే సీఎం పిఎఫ్ యజమాన్యం ఇచ్చేదాన్ని ఏం చేయాలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు.  సిఐటియు పక్షాన  తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. చట్టానికి విరుద్ధంగా సీఎం పిఎఫ్ అధికారులు,  కార్మికులకు నష్టం కలిగించే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు . ఈ మార్చి చివరిలో రిటైర్మెంట్ అయ్యే కార్మికులకు 60 సంవత్సరాల కి సెటిల్మెంట్స్ చేయటం వల్ల నష్టపోతున్నారని దీనిని వెంటనే సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టి ఇలాంటి నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో సింగరేణి ఉన్నతాధికారులకు లేఖ రాయటం జరిగిందని భవిష్యత్తులో యజమాన్యం ఈ నష్టాన్ని పూడ్చటానికి అన్ని ప్రయత్నాలు చేయాలని దీని కొరకు సిఐటియు గట్టి ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు.