అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి )శుక్రవారం రోజు పెద్దపల్లి కేంద్రంలో,  ఎమ్మెల్యే   దాసరి మనోహర్ రెడ్డి  నివాసంలో హోలీ  పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను, పెద్దపల్లి పట్టణ ప్రజలు, మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి ని,  విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డిని తన సిబ్బంది, తో ఎమ్మెల్యే నివాసం అంతా సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు ,సిబ్బంది కలిసి ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు . ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  మాట్లాడుతూ….

ముందుగా  పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు….ఈ హోలీ పండుగ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ అని,నియోజకవర్గ ప్రజలందరూ, ప్రకాశించే రంగుల వలె,సుఖ సంతోషాలతో, సిరి ,సంపదలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.