అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం SERP లో పనిచేస్తున్న మామిడిపల్లి రాజేష్ అనే సీసీ గత జనవరి 03 వ తేదీన అరోగ్యం బాగా లేక చనిపోవడం జరిగింది.వీరి కుటుంభానికి ఆసరాగా పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున పెద్దపల్లి DRDO వి.శ్రీధర్  చేతుల మీదుగా 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ DRDO పి.సునీత, పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గుఱ్ఱం రమేష్,MSCC ల అధ్యక్షురాలు ముప్పిడి కనకతారా, కార్యదర్శి జొంగోని సదాశివ,కోశాధికారి బత్తుల శంకర్,సహాయ కార్యదర్శి టి.శారద,మహిళ విభాగం నాయకురాలు టి.రజిత, PRO అణాసి శ్రీనివాస్,మండల రాజు పాల్గొన్నారు.