■ రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐఏఎస్ ఆదేశాల మేరకు…..
■ ప్రజాసేవలో 24×7 పెట్రోలింగ్ వాహనాలు.
■ నిరంతరం ప్రజల రక్షణ ,భద్రతే ధ్యేయంగా పని చేస్తాం.
■ పెద్దపల్లి ఏసిపి సాధుల సారంగపాణి వెల్లడి.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) సోమవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు... పెద్దపల్లి, సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ అధికారులతో కలిసి పెద్దపల్లి జోన్ పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ప్రజల భద్రత మరియు అత్యవసర సేవలకు గాను ప్రజలకు 24×7 నిరంతరం పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో ఉండడానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసిపి సారంగపాణి మాట్లాడుతూ…… సుల్తానాబాద్ పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, బ్లూ క్లోట్స్ సిబ్బంది, టోయింగ్ వెహికల్ సిబ్బంది, HRK పెట్రోలింగ్ వారితో, లోకల్ అంబులెన్సు, పెద్దపల్లి, సుల్తానాబాద్ పరిధిలో ఉన్న హాస్పిటల్ వారితో సమన్వయం చేస్తూ ఏదైనా లా & ఆర్డర్ సమస్య ఏర్పడిన, అత్యవసరంగా వాహనాలు జరపాల్సి వచ్చిన, ఏదైనా నేరం జరిగింది అని సమాచారం అందిన వెంటనే, ఏదైనా ప్రమాదం జరిగిన, రోడ్ పై అనవసరంగా ప్రమాదకరంగా ఆపి ఉన్న వాహనాలను క్లియర్ చేయడం ఏదైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడిన వెంటనే స్పందించి ప్రజల రక్షణ భద్రత గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే ప్రధాన లక్ష్యంతో, ఈ పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాట చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో… పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సర్కిల్ పరిధిలోని ఎస్ ఐ లు…… రాజేష్, ఉపేందర్ రావు ,మహేందర్ ,రాజ వర్ధన్, సహదేవ్ ,శ్రీనివాస్ ,శివాని ,తదితరులు పాల్గొన్నారు.
