పెద్దపల్లి మున్సిపల్ కాంట్రాక్టర్ల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

అధ్యక్షులుగా కొమ్మిశెట్టి కనకయ్య.

ఉపాధ్యక్షులుగా చింతిరెడ్డి విజేందర్ రెడ్డి ,చక్రధర్ రెడ్డి.

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి )ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లు సమావేశమైనారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా భయ్యా కొమురయ్య యాదవ్ ,గంట నరసయ్య, ఎన్నికకాగా.. అధ్యక్షులుగా కొమ్మిశెట్టి కనకయ్య .ఉపాధ్యక్షులుగా చింతిరెడ్డి విజేందర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శిగా మిడుతూరు నాగేందర్, కోశాధికారిగా ఎండి ఆశ్ర ఫ్ శరీఫ్, జాయింట్ సెక్రెటరీ దాసరి రాములు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పర్వతాలు, ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……కాంట్రాక్ట్ పనులు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే సమస్యల పైన, అందరం కలిసికట్టుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ, ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు.