అందరికీ శుభాలు కలగాలి
.. ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేసిన
.. పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్.

పాల్గొన్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )శుభకృత్ నామ సంవత్సరం లో ప్రజలందరికీ శుభాలు కలగాలని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రజలందరి జీవితాల్లో లో సరికొత్త ఆనందాల రుచులు తేవాలన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ పోలీసు శాఖకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.