ముదిరాజ్ కులస్తులు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
మంత్రి శ్రీనివాస్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల లీజు పాత ధరలనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల రాష్ట్రంలోని అనేకమంది ముదిరాజ్ కులస్తులకు లాభం చేకూరుదని. పెద్దపల్లి మండలం వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య హర్షం వ్యక్తం చేశారు ……
గతంలో శాశ్వత నీటి సౌకర్యం గల చెరువులకు హెక్టారు కు రూ 400,ఎక్కువ కాలం నిల్వ ఉంటే రూ 400,తక్కువ కాలం నీరు నిల్వ ఉంటే రూ 60 చొప్పున లీజు నిర్ణయించారు. మళ్ళీ పాత పద్ధతిని అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి తలసాని శ్రీనివాస్ కి,బండ ప్రకాష్ ముదిరాజ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య తో పాటు ,సర్పంచులు ఎద్దు కుమార్ ,సదయ్య, పోచలు ,ఎంపీటీసీ సాయి కృష్ణ ముదిరాజ్ సంఘ నాయకులు కుంభం సంతోష్, పరమేష్,శ్రీను,కందుల రాజు,కళ్యాణ్. తదితరులు తెలిపారు.
