అగ్నిధార న్యూస్ ( మంచిర్యాల )
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన ఆడెపు ధనలక్ష్మి అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనిధి కోపరేటివ్ ఫెడరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. వివాహ విందు కు వెళ్లే సమయంలో ఆలస్యం చేస్తుందని భర్త అనడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
