అగ్నిధార న్యూస్ ( మందమర్రి ) సిఐటియు మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ అల్లి.రాజేందర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.
మందమర్రి మార్కెట్ లో గల సింగరేణి గ్రౌండ్లో చాలా మంది యువ కార్మికులు కార్మికుల పిల్లలు కార్మికేతరుల పిల్లలు క్రీడలలో నైపుణ్యం, మానసిక ఉల్లాసం, శారీరక ధారుఢ్యం కొరకు రావడం జరుగుతుంది. కానీ అక్కడ కోచ్ లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతు క్రీడలలో సరియైన నైపుణ్యం పొందలేక పోతున్నారు.దానితో సింగరేణిలో అత్యంత ప్రతిభావంతులైన పథకాలు పొందిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని అంతే కాకుండా సామాజిక సేవా దృక్పథంతో ఇతర ప్రాంతాల్లో ఎంతో ఖర్చు పెడుతున్న సింగరేణి యాజమాన్యం యువ కార్మికులు,కార్మికుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్రీడా సామగ్రితో పాటు ఒక కోచ్ ను ఇండోర్ అవుట్డోర్ క్రీడల కోసం ఏర్పాటు చేయాలని, మరియు లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం కల్పించాలని, వాహనాలకు షెడ్ లేకపోవడంతో గ్రౌండ్లోకి వస్తున్నాయని దాని వలన వాకర్స్ ఇబ్బంది పడుతున్నారని దానిని నివారించాలని, గ్రౌండ్ లో కూడా ఎగుడుదిగుడులు లేకుండా సరి చేయాలని కోరుతూ ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.
