13. తతశ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములో 2 భవత్ ॥
సర్వ సైన్యాధ్యక్షుడు
సమరశంఖారావ ధ్వని
కర్ణబేరులలో కలకలం
రేపే రూపం దాల్చగా,
యావత్ కౌరవ సైన్యం
నిరుత్సాహ నిద్రను వదలి,
ఉత్సాహ కోలాహలంగా,
శంఖములు, బేరులు,
తప్పేటలు, నగారాలు,
మృదంగాలు, గోముఖాలు
వాయించ ఆరంభించగానే,
దిక్కులన్నీ బిక్కపోయే
శబ్ధం విధ్వంస, ధ్వంస
భయంకర సింహనాదం
భూలోక నాగలోక దేవలోకాలను
సైతం కాసేపు, కళ్ళప్పగించి
చూసి భీతి గోల్పెలా చేయడం..
ఆరంభ శూరత్వంమా??
లేక..
ఆయుధాలపై పట్టు
సడలలేదు అని చెప్పటమా??
గాయాకవాడ ప్రసాద్.
