అగ్నిధార న్యూస్ పెద్దపెల్లి జిల్లా
శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల పెద్దపల్లి లో ఆదివారం అం రోజు శ్రీరామనవమి ఉత్సవం మరియు
శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రారంభమై 49 సంవత్సరాల పూర్తయి 50 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా విద్యాపీఠ ఆవిర్భావ స్వర్ణోత్సవాలు జరుపుకున్నాము. ఈ కార్యక్రమం లో ప్రబంధ కారిణి సభ్యులు రేకులపల్లి శేశాంక, వెంకటేశం , , హనుమంత రావు , ప్రధానాచార్యులు,నగూరి లక్ష్మయ్య పోషకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాముడి గొప్పతనం గురించి మరియు శ్రీ సరస్వతీ విద్యా పీఠం గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. శ్రీరామ పట్టాభిషేక ఘట్టం విద్యార్థులు వేషధారణతో నిర్వహించడం జరిగింది. సంస్కృతి జ్ఞాన పరీక్షలో 40 మార్కులకు పైగా వచ్చిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశంసాపత్రాలను అందించారు.

