అగ్నిధార స్పెషల్ రిపోర్ట్
■ జిల్లా విద్య, వైద్య, కార్మిక , రెవెన్యూశాఖలు స్పందించాలి
■ ఇటుక బట్టీల పై మరిన్ని కథనాలు త్వరలో అగ్నిధారలో
■ కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం విఫలం
■ బట్టెక్కిన బాలల చదువులు
■ దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్న కార్మికులు
■ ఇటుక బట్టీలు లో అమలుకాని కార్మిక చట్టాలు
■ బట్టిలలో బాలల జీవితాలు బంది.
అగ్నిధారన్యూస్ ( డెస్క్ )పెద్దపల్లి జిల్లాలో సుమారు వంద పైచిలుకు అనుమతి పొందిన ఇటుక బట్టీలు ఉన్నాయి. కానీ ఎన్ని ఇటుక బట్టీల యజమానులు నిబంధనలు పాటిస్తున్నారు… అనే విషయం నిర్వాహకులకు,సంబంధిత అధికారులకె తెలియాలి… *అగ్నిధార పరిశీలనలో* నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ఇటుక బట్టిలే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో ఎక్కువగా ఉన్నాయి. ఇటుక బట్టీలు ఏర్పాటు చేసిన సమయంలో అధికారులకు ఇచ్చిన మాట దస్త్రాలు బుట్టదాఖలై…. ఇటుక బట్టీలలో ఇష్టానుసారంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులను అంతర్ రాష్ట్రాల నుండి ఒరిస్సా, చత్తీస్ గాడ్ ,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తదితర రాష్ట్రాల నుండి ( సర్దార్ ) మధ్య దళారుల ద్వారా వందల, వేల మంది కూలీలను ఆయా ఇటుక బట్టి యజమానులు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఏప్రిల్ చివరి వరకు లేదా మే మొదటి వారం పని దినాలకు నియమించుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ……… పొట్టకూటికోసం .వచ్చిన కూలీలను మనుషులుగా కాకుండా, పశువుల కంటే హీనంగా, గోరంగా, ఇటుక బట్టీల నిర్వాహకులు… చూస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల పైన జరిగిన, జరుగుతున్న, అఘాయిత్యాలు ,అనేకం అని చెప్పవచ్చు. కూలీల పైన నిత్యం దాడులు, అత్యాచారాలతో, భయభ్రాంతులతో ,వారిలో ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తూ… పైశాచిక ఆనందాన్ని పొందుతారు,అనేది విమర్శ. ఇటుక బట్టీలలో పనిచేసే చాలామంది కూలీలు దుమ్ము ,ధూళితో శ్వాసకోస వ్యాధులతో నిత్యం సతమతమవుతూ ఉండే వాళ్లు అనేకం, నిత్యం బట్టిలో మట్టితోనే సహవాసం చేస్తూ వారి బతుకులు మట్టిపాలు అవుతున్నాయి . అనే విషయమై వివిధ సందర్భాలలో ఆయా పార్టీలు, ప్రజా సంఘ నాయకులు అధికారులకి ఫిర్యాదు చేసిన సంఘటనలు అనేకం. అదేవిధంగా ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికుల పిల్లలకు కచ్చితంగా కల్పించాల్సిన చదువు అటుకెక్కిందిని చెప్పవచ్చు… ….వర్క్ సైట్ లోనే ఆయా ప్రాంతాలకు చెందిన భాషలో విద్య అందించాల్సిన బాధ్యత ఇటుక బట్టి నిర్వాహకులదే……. సంబంధిత భాషలో ప్రావీణ్యం ఉన్న వారిచేత బడి ఈడు పిల్లలకి విద్య బుద్ధులు నేర్పించాల్సి ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కాన రాక పోవడం విస్మయానికి గురిచేస్తుంది. పిల్లల భవిష్యత్తు తరగతి గదులలో నిర్ణయించబడుతుంది అనేది నానుడి కానీ అది ఇటుక బట్టీలలో పనిచేసే కూలీల పిల్లలకు వర్తించదు అనేది సత్యం. జీవితాంతం వారి బతుకులు మట్టిపాలే అన్న చందంగా కనబడుతుంది … స్థానిక విద్యాశాఖ అధికారులకు ఇటుక బట్టీలలో బాల కార్మికులు ఉంటారని తెలిసి కూడా ఇంటర్ స్టేట్ మై గ్రేట్ అయ్యి వచ్చిన కార్మికుల పిల్లల యొక్క చదువులపై దృష్టి సారించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇటుక బట్టీలలో పిల్లల చేత పనులు చేయిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. బాల కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా పనులు చేయిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న పట్టించుకునే నాధుడే లేరు.2015 సంవత్సరం నుండి కార్మిక శాఖ అధికారులకు స్వతహాగా ఇటుక బట్టీలకు వెళ్లి తనిఖీలు చేసే అధికారం లేకపోవడంచేత ఇటుక బట్టి నిర్వాహకులది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. కార్మిక శాఖ అధికారులకు తనిఖీలు చేసే అధికారం లేకపోవడంలో లో లోగుట్టు పెరుమాండ్లకే తెలవాలి …… అదేవిధంగా వారానికి ఒకసారైనా వైద్య పరీక్షలు బట్టిలలో పనిచేసే కార్మికులందరికీ ఆర్.ఎం.పి తోనైనా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.నివసించడానికి నివాసయోగ్యమైన ఇండ్లు మంచి అహ్లాదకరమైన వాతావరణం కల్పించడం మరియు మరుగుదొడ్లు ,స్నానపు ,గదులు సౌకర్యాలు కల్పించాలి. కానీ ఎక్కడ నిర్వహణ సక్రమంగా లేక కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్న సన్నివేశాలు అటు వైపు వెళ్లిన ఎవరికైనా దర్శనమిస్తాయి. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఇటుక బట్టి నిర్వాహకులు విఫలం అయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటుక బట్టీలలో ఉన్న పరిస్థితులు కూడా నిజమే అనేలా కనిపిస్తుంటాయి. ఇటుక బట్టీలలో కార్మికులు నివసించే స్థలాలు సౌకర్యవంతంగా లేక పోను ఇరుకు ఇరుకు గదులలో బెరుకు బెరుకుగా బట్టి కార్మికులు మట్టిలో జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు అటువైపు ఒక కన్నేసి కార్మికులకు వారి పిల్లలకు జరుగుతున్న అన్యాయాల,సౌకర్యాలపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

