కరపత్రం విడుదల చేస్తున్న ఉపాధ్యాయులు
ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వ్యాసరచన పోటీ
స్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపల్లి ( బాయ్స్ )
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )ఈ నెల 11 సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు నిర్వహించ తలపెట్టిన మహనీయుల జీవిత చరిత్రపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీ ,ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇందుకుగాను మొదటి ప్రైజ్ మనీ 3000 రూపాయలు రెండవ ప్రైజ్ మనీ 2000 రూపాయలు మూడవ ప్రైజ్ మనీ 1000 రూపాయలుగా ప్రకటించారు. దీనికిగాను పెద్దపల్లి కేంద్రంలోని జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ( బాలుర ) శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు పాఠశాలలో P.G H.M లు మురళి నాయక్ , రాఘమయి చేతుల మీదుగా మహానీయుల జీవిత చరిత్ర పై నిర్వహించే జిల్లా స్థాయి వ్యాసరచన పోటీ కరపత్రం రిలీజ్ చేయడం జరిగిందని ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల జ్యోతీ , సట్టు కనుకయ్య , శ్రీ బుల్లయ్య , రాజేందర్ మొదలైనా వారు పాల్గొన్నారు . ఇట్టి కార్యక్రమానికి కార్యక్రమానికి హాజరైన వారందరికీ సొసైటీ తరుపున లింగమల్ల శంకర్ ధన్యవాదాలు తెలిపారు.
