అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) జూలపల్లి మండలం తెలుకుంట  గ్రామంలో తన ఇంటి పై నల్ల జెండా ఎగురవేసి.  నిరసన తెలిపిన  జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్.  తెలంగాణ రైతాంగం పండించిన వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి విడనాడాలని అన్నారు.
ఈ సందర్భంగా  జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్   మాట్లాడుతూ…… టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  పిలుపుమేరకు ఎమ్మెల్యే  దాసరి మనోహర్ రెడ్డి  సూచనల మేరకు జూలపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు తమ ఇళ్లపైన నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రైతులను నష్టపరిచే ఉద్దేశంతో  మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వడ్లు కొనుగోలు చేసేదాకా పోరాటం ఆగదన్నారు. గతంలో కొనుగోలు చేసిన విధంగానే ఇప్పుడు కూడా వడ్ల కొనుగోలు చేయాలని  నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చాతల్ల కాంతయ్య, స్థానిక సర్పంచ్  సొల్లు పద్మ శ్యామ్ ఉప సర్పంచులు చొప్పరి నరసింగం, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షులు చిగురు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూరిశెట్టి రాజేశం, కందుకూరు వెంకన్న,  తడకపల్లి వెంకటేశం, సంకెళ్ళ లక్ష్మీనరసయ్య, పిళ్లి భూమయ్య, చిప్ప శ్రీకాంత్, తీగల వీరేశం,  మల్లారపు అంజయ్య  పాల్గొన్నారు.