అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ):బుధవారం రోజు సుల్తానాబాద్ మునిసిపాలిటీ కేంద్రంలో 42వ బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ బిజెపి మండల అధ్యక్షులు కడారి అశోక్ రావు మరియు పట్టణ అధ్యక్షులు ఎల్లంకి రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మీసా అర్జున్ రావు హాజరై బిజెపి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీసా అర్జునరావు మాట్లాడుతూ……..బిజెపి చరిత్రాత్మక పార్టీ, దేశ రాజకీయాల్లో అవినీతిని తొలగించడానికి బీజేపీ ఆవిర్భవించింది అన్నారు. 2 ఎంపీ స్థానాలతో మొదట ప్రారంభమై దేశంలోనే నేడు అతి పెద్ద పార్టీగా అవతరించింది అన్నారు.బిజెపి పాలన పై ప్రజల కు ఉన్న నమ్మకం ఉంది అన్నారు మోదీ దేశ ప్రధానిగా ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అన్నారు. దేశంలో పేదల అభ్యున్నతికి బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. తెలంగాణ ప్రజలు కూడా మార్పునే కోరుకుంటున్నారు అన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో చింతల లింగారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం మహిపాల్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నాగుల మల్యాల తిరుపతి, రాజేంద్రప్రసాద్, చాతరాజు రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి భూసారపు సంపత్, సదయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గుడ్ల వెంకటేష్ , ఒజ్జా సతీష్, ఎనగందుల సతీష్, బుర్ర సతీష్ గౌడ్, పతంగి శ్రీకాంత్, బండ శ్రీనివాస్ యాదవ్, మారవేని అరవింద్, మామిడి శేఖర్, రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు
