■  గంజాయి ఇతర మత్తు పదార్థాల పైన నిరంతర నిఘా డి సి పి రవీందర్.

■  సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం

■  నగదు పురస్కారం అందిస్తాం డి సి పి

■  కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఏసిపి సాదుల సారంగపాణి

★★★  100 కేజీల గంజాయి బసంత్ నగర్ లో దహనం చేసిన పోలీస్ శాఖ

అగ్నిధారన్యూస్ ( రామగుండం కమిషనరేట్ )
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లాలో 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు నమోదైన 10 కేసులలో కోర్టు పర్మిషన్ తో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు పెద్దపల్లి డి సి పి రవీందర్ ఆధ్వర్యంలో …..సీజ్ చేసిన సుమారు 100 వందల కిలోల గంజాయిని బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ కొలిమి లో కాల్చి వేయడం జరిగింది.
ఈ సందర్భంగా పెద్దపల్లి డిసిపి రవీందర్ యాదవ్ మాట్లాడుతూ…

గంజాయి రవాణా, సాగుకు, వినయోగం కి పాల్పడే వారి మూలాలను గుర్తించి వారి పట్టుకోవడం , గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుంది అన్నారు.గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతుంది అన్నారు.పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేస్తాం అన్నారు.ప్రతి పట్టణం, కాలనీ, గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,యువతపైదృష్టిసారించాలన్నారు.గంజాయి మత్తులో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడతారో తెలియని పరిస్థితిలో ఉంటారన్నారు. అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కి గాని, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని , వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్,కేసులు నమోదైన సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ లు పాల్గొన్నారు.