అగ్నిధార న్యూస్ ,గోదావరిఖని:
*గుప్తనిధుల కోసం ప్రయత్నం చేసే వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ముస్త్యాల గ్రామ శివారులో అనుమానస్పదంగా తిరిగితున్న కారు ఆపి కారులో వ్యక్తులను విచారించగా వారు పొంతనలేని సమాధానం చెప్పగా అనుమానం వచ్చి వారిని మరియు కారును తనిఖీ చేయగా మెటల్ డిటేక్టర్,ఇతర ఎలక్ట్రికల్ డివైజెస్ లభించడం జరిగింది. ఇవి ఎందుకు మీ దగ్గర ఉన్నాయి అని విచారించగా పురాతనమైన ప్రాంతాలలో గుప్తా నిధుల ఉంటాయి అని వాటిని గుర్తించడం కోసం తిరుగుతున్నాం అని చెప్పడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
*పట్టుబడిన వారి వివరాలు*
1. సాన తిరుపతి s/o భూమయ్య,41yrs, మున్నూరుకాపు,చున్నాముబట్టీవాడ, మంచిర్యాల
2. పానగంటి హరీష్ s/o సత్యనారాయణ,29yrs, వడ్రంగి, ఆసిఫాబాద్, సందీప్ నగర్, (ప్రస్తుతం గడ్డరాగడి టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు)
3. ఈట కృష్ణ s/o మల్లేష్,40yrs, బెల్లంపల్లి బస్తీ, బెల్లంపల్లి
4.గొర్లవల్లి అశోక్ s/o మొగిలయ్య, నేతకానీ, కాసిపేట
