క్యాన్సర్ తో బాధపడుతున్న క్రీడాకారునికి ఎస్ ఐ ఆర్థిక సహాయం

అగ్నిధారన్యూస్(  సుల్తానాబాద్ )అనారోగ్యంతో బాధపడుతున్న MD,జిలానికి. సుల్తానాబాద్ SI ఉపేందర్ రావు  ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలలోకి వెళితేసుల్తానాబాద్ పట్టణంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సీనియర్ వాలీబాల్ ఆటగాడు MD,జిలాని ఇంటికి మంగళవారం రోజు  సుల్తానాబాద్ SI  U.ఉపేందర్ రావు  వెళ్లి అతని ఆరోగ్యం విషయం  తెలుసుకొని పరామర్శించి 5.000/- ఐదు వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఇచ్చి తన దాతృత్వం  చాటుకున్నారు. ఇంతకుముందు కూడా
ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలూ అందిస్తున్న  సుల్తానాబాద్ పోలీస్ అధికారిగా ఉండడం గర్వకారణం అని పలువురు హార్ష్యం వ్యక్తం చేశారు.