అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని పెద్దపల్లి నుండి కూనారం వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్‌ను ఈనెల 16 ఉదయం 6గంటల నుండి 17 సాయంత్రం 7గంటల వరకు మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారి  తెలిపరు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం రెవెన్యూ,మున్సిపల్‌,ఆర్టీఓ, పోలీస్ అధికారులకు అందజేశారు. రైల్వేగేట్‌   మూసి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని,వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పేర్కొన్నారు.రెండు రోజుల పాటు కొనసాగే మరమ్మతులకు ప్రజలు సహకరించాలని కోరారు.