అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.

నిందితుడి వివరాలు

1.పత్తి కనకయ్య s/o గోపాల్,25yrs, రేకుర్తి, కరీంనగర్, ప్రస్తుతం, పోనాకల్, జన్నారం, మంచిర్యాల జిల్లా

పరారీలో మరో ఇద్దరు…తూర్పటి కనుకయ్య              తూర్పటి మైసయ్య

3 గ్రాముల బంగారం,10 1/2 తులాల వెండి, 8,000 నగదు స్వాధీనం వాటి మొత్తం విలువ 30,000

వివరాల్లోకి వెళితే…..

నిందితులు ముగ్గురు వివిధ రకాల కూలిపని చేసుకుంటూ జీవిస్తూ అట్టి కూలీ డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటుపడి అప్పులు చేసి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో తిరుగుతూ ఉండేవారు. గతంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ టౌన్, జూలపల్లి లో వీరిపై దొంగతనం కేసు నమోదు కేసులు జైలు కి వెళ్లి వచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన వారి ప్రవర్తనలో మార్పు రాకపోగా చిల్లర దొంగతనాలు చేసి జల్సాలు చేస్తుండేవారు. నిందితులు ముగ్గురు తేదీ 19.10. 2021 రోజున రాత్రి వారి ద్విచక్ర వాహనం పై వచ్చే రాత్రి సమయంలో సుల్తానాబాద్ మండల పరిధిలోని నీరుకుల్లా గ్రామం శివారు లోని రంగంపల్లి లోని పెద్దమ్మ తల్లి గుడి లో, ఎల్లమ్మ గుడి లో ఉండి లు పగలగొట్టి అందులోని డబ్బులు తీసుకున్నారు. దేవతలపై ఉన్న బంగారు పుస్తెలు రెండు ముక్కుపుడుక దొంగిలించుకుని, రంగనాయక దేవాలయానికి వెళ్లి అక్కడ దేవుడి గుడి తలుపులు తెరిచె ప్రయత్నం చేయగా తెరుచుకోకపోవడంతో దేవుడి గుడి ముందున్న ఉండి పగలగొట్టే ప్రయత్నం కూడా చేసినారు.  అక్కడ నుండి మానేరు వాగు దాటి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలోని వేగురుపల్లి ఓటు కారు గ్రామ మధ్యలోని దేవాలయాల్లోని దేవాలయ తలుపులు పగులగొట్టి నగదు దేవుడి వెండి ఆభరణాలు దొంగిలించుకు వెళ్ళినారు. వాటి విలువ సుమారు 45 వేల వరకు ఉంటుందని అన్నారు.

దొంగలను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాకచక్యంగా వ్యవహరించిన సుల్తానాబాద్ SI ఉపేందర్, ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్ విష్ణువర్ధన్ రెడ్డి మిగతా పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు రివార్డు ఇచ్చి అభినందించారు.