అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి మండలం, హనుమంతుని పేట గ్రామంలో, పల్లె ప్రగతి  కార్యక్రమంలోభాగంగా చివరి రోజు మండల అభివృద్ధి అధికారి ఎం రాజు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని హరిజన కాలనీలో సంవత్సరాల కాలంగా శిథిలావస్థలో ఉన్న ఇంటిని దగ్గరుండి ప్రోక్లిన్ తో కూల్చి వేయించారు. అదేవిధంగా పక్కనే ఉన్న దట్టమైన సర్కారు తుమ్మ చెట్లను తొలగింప చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ…. గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని శుభ్రత పాటించాలన్నారు. గ్రామంలో మురుగునీటి నిల్వలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అన్నారు. తడి చెత్త పొడి చెత్త  వేరు చేస్తూ వర్మి కంపోస్టు తయారీకి దృష్టిసారించాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల సదయ్య,ఎంపీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.