రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా, అక్రమ NIA, ఊపా (UAPA) చట్టాల రద్దుకై పోరాడుదాం పౌరహక్కుల సంఘం ( CLC )
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) పౌరహక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పెద్దపల్లి లోని ప్రెస్ క్లబ్ లోఆదివారం రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులపై,అక్రమ UAPA చట్టం ,NIA దాడులు రాజ్యనిర్బందానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమానికి.. ప్రధాన వక్తలు పౌరహక్కుల సంఘాo రాష్ర్ట అద్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు విచ్చేసి, మాట్లాడుతూ…
సమాజంలో సామాజిక బాధ్యతగా కర్తవ్యం నిర్వహిస్తున్న సామాజిక హక్కుల కార్యకర్త, తీస్తా సేతల్వాద్, ప్రముఖ గాంధేయవాది హిమాన్షు కుమార్,ఉద్యోగ బాధ్యత నెరవేస్తున్న గుజరాజ్ మాజీ DIG R B శ్రీకుమార్,లపై సుప్రీంకోర్టును న్యాయ మడిగితే, మీరే నేరస్తులంటూ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు సుప్రీంకోర్టు తీర్పులివ్వడం, ఇదే గుజరాత్ మారణ హోమం కేసులో IPS అధికారి సంజీవ్ భట్ ను జైల్లో బందీ చేయడం,జర్నలిస్ట్ లు జుబేర్,కప్పన్, రూపేష్ సింగ్ లపై అక్రమ కేసులు జైల్ నిర్బంధం. గుజరాత్ గోద్రా ఘటన అనంతరం 2002 ఫిబ్రవరిలో జరిగిన బిల్కిస్ బానో ఐదు నెలల ముస్లిమ్ మహిళ గర్భిణీ పై మతోన్మాద మూకల సామూహిక అత్యాచారం, తన7 గురు కుటుంబ సభ్యులను హత్య చేసి,తనచిన్న కూతురు ను గోడకేసి కొట్టి చంపి,14 మందిని అమానుష హత్యాకాండ చేసిన నేరస్తులకు సుదీర్ఘ పోరాట అనంతరం జీవిత ఖైదు విధిస్తే, ఆ 11 మంది జీవిత ఖైదీలను సుప్రీంకోర్టు కనుసన్నల్లోనే గుజరాత్ BJP ప్రభుత్వం 15ఆగస్టు,2022,నాడు క్షమా భిక్ష తో విడుదల చేయడం అత్యంత దుర్మార్గమైన విషయం అన్నారు. ఈ మోడీ ప్రభుత్వం-అమిత్ షా ల నిర్ణయాన్ని సభ్య సమాజం వ్యతిరేకించారు.ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ GN సాయిబాబా ను కుట్రతో జైల్లో నిర్బంధించడం, దేశవ్యాప్తంగా 16 మంది మేధావులను, భీమా-కోరేగామ్ కుట్రతో బెయిల్ రాకుండా జైళ్లో నిర్బంధించారు.84 ఏండ్ల ఆదివాసీ హక్కుల నాయకుడు ఫాథర్ స్టాన్ స్వామి ని భీమా-కోరేగాం కుట్ర కేసులో పార్కిన్ సన్ వ్యాధితో, తాగడానికి కనీసం సిప్పర్ ట్యూబ్ ఇవ్వాలన్న ఇవ్వకుండా,బెయిల్ నిరాకరించి ముంబయి జైల్లో నే 5 జులై,2021ఫాదర్ స్టాన్ స్వామిని వ్యవస్తి కృత హత్యగా అంతమొందించారు.పాండునరోటెది ముమ్మాటికీ రాజ్యవ్యవస్థ చేసిన మరొక హత్య…… ఆదివాసీ హక్కుల నాయకుడు ఫాథర్ స్టాన్ స్వామి మరణం తరువాత, జరిగిన రెండోవ వ్యవస్తికృత హత్య పాండు నరోటె ది..33 సంవత్సరాల పాండు నరోటె అక్రమ కేసులోప్రొఫెసర్ GN సాయిబాబా తో అరెస్ట్ చేయబడి నాగపూర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు..26 ఆగస్ట్,2022న నాగపూర్ GMHC హాస్పిటల్ లో సాయంత్రం 5:30 గంటలకు అనుమాన స్పద స్థితిలో మరణించాడు., జైల్ నుండి రెండు రోజుల క్రితం, కుటుంబసభ్యులకు,నరోటె అడ్వకేట్ కు సమాచారం ఇవ్వకుండా జైల్ అధికారులు GMHC హాస్పిటల్ కు తరలించినారు., అతని అనారోగ్యం, సమాచారం గూర్చి ఇవ్వకుండా మరణానికి కారణమైనారు.. దేశవ్యాప్తంగా , ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న విమర్శలకు వరవరరావు , తీస్తా సేతల్వాద్ కు కు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. NIA దుర్వినియోగం ,CBI, ED, EC లను ప్రతిపక్ష పార్టీలపై ప్రయోగించి, ప్రభుత్వాలను కూలగొట్టడం, ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకొని, విచ్చలవిడిగా ఊపా చట్టాన్ని ప్రయోగిస్తున్న ఈ ఎనిమిది సంవత్సరాల మోడీ BJP కేంద్రప్రభుత్వం కార్పొరేట్ అనుకూల పాలన ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ అంబాని లకు చౌకగా అమ్మివేయడం,కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక, , రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరాడాలని పిలుపునిచ్చారు.రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానాలు...బిల్కిస్ బానో అత్యాచారo,14 మంది హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 11 మంది ఖైదీల క్షమాబిక్షను రద్దుచేయాలి….తీస్తా సేతల్వాద్,గాంధేయ వాది, హిమాన్షుకుమార్ లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అన్యాయమైన, తీర్పులను సమీక్షించి, ఉపసంహరించాలి. గుజరాత్ DIG శ్రీ కుమార్, SP సంజీవ్ భట్ లపై వెలువరించిన తీర్పులను బేషరతుగా ఉపసంహరించాలి.
ఊపా(UAPA) చట్టాన్ని, NIAరద్దుచేయాలి.
BJP కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, NIA ద్వారా 2018 లో అక్రమంగా 15 మంది దేశవ్యాప్త మేధావులు, హక్కుల కార్యకర్తలు, రచయిత వరవరరావు తో పాటు భీమా-కోరేగాం కుట్ర కేసులో జైల్లో నిర్బదించబడ్డ వారిని బేషరతుగా విడుదల చేయాలి.నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ GN సాయిబాబా, ఇతర 4 గురు సామాజిక కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి.BJP కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు, CBI, ED, IT ,ఎలక్షన్ కమిషన్ లను దుర్వినియోగం పరుస్తు, ప్రతిపక్ష పార్టీలపై చేస్తున్న దాడులను నిలిపివేయాలి.
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక,రైతు,కార్మిక వ్యతిరేక,అదాని,అంబానీ లకుదేశ వనరులను, కారుచౌకగా ఇస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని, NIA దాడులను, ఊపా చట్టాన్ని దుర్వినియోగం ను,తెలంగాణ ముఖ్యమంత్రి KCR చిత్తశుద్ధితో వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలోరౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారు..
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం తెలంగాణ.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.శ్రీపతి రాజగోపాల్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…పుల్లా సుచరిత, ఉపాధ్యక్షురాలు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…
.నారవినోద్, ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…బొడ్డుపెళ్లి రవి ,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…గడ్డం సంజీవ్, కుమార్, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…పోగుల రాజేశం,కోశాధికారి, మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…యాదవనేని పర్వతాలు, EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ… రాజన్న,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ…బాలసాని రాజయ్య, విరసం రచయితగుమ్మడి కొమురయ్య, TPF కన్వీనర్, పెద్దపెల్లి జిల్లా.A. అంజయ్య,TPF కన్వీనర్.శ్రీమాన్,BCసంఘాల,నాయకుడు. మార్వాడి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్, తెలంగాణ. రామిల్ల బాపు, అధ్యక్షుడు, పెద్దపెల్లి జిల్లా దళిత లిబరేషన్ ఫ్రంట్.ఎరుకల రాజన్న ప్రధానకార్యదర్శి, రైతు సమస్యల సాధన సమితి, తెలంగాణ.పొన్నం రాయమల్లు, ప్రజాసంఘాల నాయకుడు.తాండ్ర సదానందం, CPI పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి.జమతే ఇస్లామిక్ హింద్ నాయకులు, జావేద్, అలిమోద్దీన్, హాది, రవూఫ్,డాక్టర్ MA హమీద్.వెల్తుర్ సదానందం, మాల మహానాడునాయకుడు ..పోగుల శేఖర్, ప్రజాసంఘాలనాయకుడు.తదితరులు పాల్గొన్నారు.

