■  రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్.

■  మంత్రి సూచనల మేరకు వెటర్నరీ అధికారులను ఆదేశించిన  చైర్మన్.

■  వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సదుపాయాలు కల్పించిన అధికారులు.

■  బాధితుల యోగక్షేమాలు కనుక్కున్న చైర్మన్ బాలరాజు యాదవ్.

అగ్నిధారన్యూస్ (మెదక్ ) మెదక్ జిల్లా కొల్చారం మండలం క్రిష్టపూర్ గ్రామం మంజీరా నది లో నారాయణపేట్ జిల్లా నుండి గొర్రెలు మేపటానీకి వచ్చి,మంజీర నది ఆవుతల వైపు చిక్కుకోవడం జరిగింది.దాదాపు 1500 వందల గొర్రెలు,
6 గురు గొర్రెల కాపర్లు చిక్కుకుపోయిన విషయం చైర్మన్ శ్రీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్  దృష్టికి తీసుకురాగా వెంటనే  విషయం  మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు MD.రామచంద్రం &వెటర్నరీ జిల్లా అధికారి విజయ శేకర్ రెడ్డి తో మాట్లాడి అక్కడ ఉన్న ఒక విశ్రాంతి భవనంలో సదుపాయాలు ఏర్పాటు చేయించి,వరధ తగ్గగానే వారిని ఒడ్డుకు ఇటువైపు తీసుకురావాలని అదికారులకు ఆదేశించారు. అంతేకాక అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు మల్లేశం యాదవ్ &అనిల్ తో పోన్ లో వారితో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.