■  అగ్నిధార E PAPER ట్రయల్ రన్  ప్రారంభించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.

■  అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు.

■  మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్ష.

■  అభినందనలు తెలిపిన అదనపు కలెక్టర్.

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) అగ్నిధార పత్రిక గత సంవత్సర కాలంగా పెద్దపల్లి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతోపాటు ,ప్రజా సమస్యల పైన సమకాలీన రాజకీయాల పైన అభివృద్ధి, సంక్షేమ, కార్యకలాపాల పైన, తాజా సమాచారంను  అందిస్తూ, అతి తక్కువ కాలంలోనే పాఠకుల,ప్రజల అధికారుల, ప్రజాప్రతినిధుల, మన్ననలు పొందుతూ… అత్యంత గుర్తింపు పొంది ,అందరి ఆదరాభిమానాలతో, మరో ముందడుగు వెయ్యబోతుంది. ఈ పేపర్ గా రూపాంతరం చెందుతున్న సందర్భంగా, అగ్నిధార యాజమాన్యం మీతో తెలుపుటకి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రోజు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అగ్నిధార ఈ పేపర్ ట్రాయల్ రన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన పత్రిక అగ్నిధార అన్నారు.   రాబోయే రోజుల్లో E PAPER.. మరింత అభివృద్ధి చెందాలని. మరింత గుర్తింపు పొంది ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలపైన, అభివృద్ధి, సంక్షేమ పథకాల పైన, మంచి మంచి కథనాలు రాయాలన్నారు. ఈ సందర్భంగా అగ్నిధార యజమాన్యం చేగొండ రవి కుమార్ యాదవ్ ని అభినందించారు.