అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి:దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు ఆ గ్రామాల్లో ఉండే అటువంటి విభిన్న కులాలు జాతులు మతాలు అందరూ కలిసి భిన్నత్వంలో ఏకత్వం లాగా జీవించే టువంటి పరిస్థితి భారతీయ సంస్కృతి అదేవిధంగా భారతదేశం కళలకు కళాకారులకు నిలయం ఉన్నటువంటి 64 కళలు నేడు ఆ కలలన్నీ తెరమరుగై పోయి మానవ జీవన విధానం కేంద్రక కుటుంబం వ్యవస్థను నుండి వికేంద్రీకరణ కు దారితీస్తున్నాయి కారణం ప్రాశ్చాత్య సంస్కృతి పోకడలు భారతదేశం సంస్కృతి పై సాంప్రదాయాలపై దాడి చేసి ,{ఫ్యాషన్}. మోడ్రన్ ఫలితంగా మన సంస్కృతి సాంప్రదాయాలు చిన్నాభిన్నం అవుతున్నాయి పట్టణ వ్యవస్థీకృత అయినప్పటికీ కొంతమంది కళాకారులు తమ తమ కులవృత్తులను నమ్ముకొని ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నారు అలాంటి వారిలో బహురూపుల కళాకారులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కు చెందిన పగటి వేషాలు  కళాకారులు పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో అగ్నిధార కు కనిపించారు  ఈ సందర్భంగా కళాకారుడు సైదులు మాట్లాడుతూ పగటి వేషాలు కళ అనేది అనాదిగా వస్తున్నటువంటి గొప్ప కళ మా తాతల తండ్రుల కాలం నాటి నుండి ఇదే కళను నమ్ముకొని సంచార జీవితం గడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నా మన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను తిరుగుతూ జీవనోపాధి పొందుతున్న మన్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రామంలో ఐదు రోజులు పకీరు  లంబాడి పోతు రాజు  బ్రహ్మంగారు  బేతాళుని కాళికామాత చివరి రోజు డప్పుల చెప్పులతో ఐదు వేషధారణలతో ఊరంతా తిరిగి ఆరవ రోజు ఇల్లిల్లూ తిరుగుతూ దయా భక్తితో ప్రజలు ఇచ్చే డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నా మన్నారు ఈ సందర్భంగా గా సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా కళ ను గుర్తించి కళాకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.