అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన కొమ్మ రాజు యాదవ్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కచాపూర్ వెంకట్రావు పల్లి గ్రామాల మధ్య మృతి చెందినట్లు స్థానికుల సమాచారం మేరకు జూలపల్లి ఎస్ ఐ వెంకట కృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.