అగ్ని ధార న్యూస్ జగిత్యాల మావోయిస్టు పార్టీ అగ్రనేత అంతర్జాతీయ విప్లవ సమూహాల కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇలాకాలో మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో ఏనాడు లేని విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జారీ అయిన ఈ లేఖలు సంచలనంగా మారాయి. భూ దందాలకు పాల్పడుతున్నారని అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని పేర్కొంటూ రాసిన ఈ లేఖలు చర్చనీయాంశంగా మారాయి. అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని పేర్కొంటూ ఈ లేఖలు చర్చనీయాంశంగా మారాయి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని నరసింహులపల్లి కు చెందిన 14 మందితో పాటు మండలంలోని 12 మంది సర్పంచులు ఒక ఎంపీపీ ఒక ఎంపీటీసీని లక్ష్యంగా చేసుకొని ఈ లేఖలు విడుదలయ్యాయి. అయితే బీర్పూర్ బ్లాస్టింగ్ తర్వాత పీపుల్స్ వారే కావచ్చు మావోయిస్టు పార్టీ వారే కావచ్చు బీర్పూర్ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారించిన సందర్భాలు తక్కువేనని చెప్పొచ్చు. అనూహ్యంగా ఇప్పుడు బీర్పూర్ మండల ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ విడుదలైన లేఖలు హార్ట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు.


*లక్ష్యం భోగసత్తన్న*
మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన మూడు లేఖల్లో కూడా నర్సింలపల్లెకు చెందిన భోగ సత్తన్న కిరాణం షాపును కూల్చాలంటూ ప్రత్యేకంగా పేర్కొనడం విశేషo. ఆయనకుప్రజా కోర్టులో శిక్ష తప్పదు అంటూ ప్రస్తావించిన తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భోగ సత్తన్న కిరాణా షాప్ లక్ష్యం చేసుకొని కావాలనే హెచ్చరికలకు పాల్పడ్డారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.