ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే  మహేష్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ ( మహమ్మదాబాద్ )

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిగి నియోజకవర్గ ప్రజల పక్షాన గురువారం నాడు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మెతుకు ఆనంద్ కాలే యాదయ్య లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు  అన్నారు.రైతు బంధు,రైతు భీమా,24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తూ నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్,రైతు వేదికలు,రైతు కల్లాలు  వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని తెలిపారు.నేడు చాలా రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు కావాలని ప్రజల నుండి డిమాండ్ వస్తుందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకాలు చేసిన పరిగి నియోజకవర్గ రైతులందరికీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.