ఓ ఇంటికి తాళం వేసిన సర్పంచ్ భర్త.

_24000 అప్పు తీర్చలేదని.

_కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు తీసి ఇంటికి తాళం.

_ఇంటి బయటే ఉన్న బాధిత కుటుంబం.

_చీకట్లో రాత్రంతా బయట భయం భయంగా ఉన్న సంఘటన.

అగ్నిధారన్యూస్,ఇచ్చోడ:

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేయించాడు అదే గ్రామానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి నుండి శ్రీనివాసు 24 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సదరు వ్యక్తి అప్పు చెల్లించకపోవడంతో సర్పంచి భర్తను ఆశ్రయించగా సర్పంచ్ భర్త ఆ సదురు వ్యక్తిని కుటుంబ సభ్యులను ఇంటి నుండి బయటకు తీసి ఇంటికి తాళం వేయించడంతో ఆ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి నుండి ఇంటి బయటనే చీకటిలో ఉన్నారు. చీకట్లో రాత్రంతా బయట భయం భయంగా ఉన్న సంఘటన ఇచ్చోడ మండలంలో చర్చనీయాంశంగా  మారింది.