అగ్నిధారన్యూస్, మానకొండూర్: ఆదివారం సాయంత్రం లలితాపూర్ గ్రామం వద్ద హుజురాబాద్ శాసనసభ్యులు రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో స్వల్ప ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే లలితాపూర్ గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని హుజురాబాద్ వెళుతుండగా   చీకటి పడడంతో ఎదురుంగా వస్తున్న గొర్రెల  మందను తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఈటల రాజేందర్ తో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.