కౌన్సిలర్స్ సహకారం మరువలేనిది 

 కోట్లాది నిధులతో పెద్దపల్లి పట్టణాభివృద్ధి

సర్వాంగ సుందరంగా పెద్దపల్లి పట్టణం

మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి 

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిటౌన్ )

గురువారంరోజు పెద్దపల్లి పట్టణంలోని 2,23,28,30,12,33 వార్డులో ఎస్డిఎఫ్ , మున్సిపల్ జనరల్ ఫండ్, టియుఎఫ్ఐడి సి,14 ఎఫ్ ఎస్ సి నిధులు ద్వార 5 కోట్ల 81 లక్షల 28 వెయ్యిల రూపాయలతో పనులకు పెద్దపల్లి మున్సిపల్  చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి స్థానిక కౌన్సిలర్లతో, కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ… గతంలో ఎన్నడు లేని విదంగా  కౌన్సిల్ కు పెద్దపల్లి శాసనసభ్యులు  దాసరి మనోహర్ రెడ్డి  సహకారంతో  పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఎమ్మెల్యే నిత్యం అందిస్తున్న, సహాయ సహకారాలతో, పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరి కరంగా తీర్చిదిద్దుతున్నామని, మా మున్సిపల్ కౌన్సిల్ కు అన్ని విధాల అండదండలు అందిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న  ఎమ్మెల్యేకి   ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ ఆదర్శ పార్టీగా మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్  వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మేనేజర్ శివప్రసాద్ , ఏఈ సతీష్  మున్సిపల్ సిబ్బంది వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.