అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దుబ్బపల్లి రాజీవ్ రహదారిపై సుల్తానాబాద్ పోలీసులు రాబోయే శాసనసభ ఎన్నికల దృష్ట్యా మంగళవారం రోజున చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇకనుంచి ఎవరైనా 50,000 వేలకు మించి నగదు తీసుకెళ్తే తప్పనిసరి రసీదు ఆధారాలు చూపాలని లేనిచో ఎలక్షన్ కమిటీసీజ్ చేస్తుందని, బంగారం వెండి కొనుగోలు చేసిన రసీదులు తప్పనిసరి కొనుగోలు అమ్మకాలు, ఆస్పత్రిలో బిల్లులు చెల్లింపు చేసిన సరే రసీదులు తప్పనిసరి ఉండాలని 50 వేలకు నుంచి మీ జేబుల్లో ఉంటే ఆధారాలు ఉండాలి లేకుంటే సీజ్ చేస్తామని ముఖ్యంగా రైతులు తమ పంటలు అమ్మిన వారి వ్యాపారస్తుల దగ్గర నుండి తప్పనిసరి రసీదులు తీసుకోవాలని సుల్తానాబాద్ ఎస్ ఐ విజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, కానిస్టేబుళ్లు మర్రి రాజు కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.