అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:
తన కుమారునికి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు..?
ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీలో ముఖ్య నేతగా ఉన్న పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి బిజెపి ఇటీవల విడుదల చేసిన శాసనసభ అభ్యర్థుల విషయంలో తనకు, తన కుమారునికి బిజెపి శాసనసభ సీటు విషయంలో బిజెపి అధిష్టానంతో అసహనం వ్యక్తం చేసినట్లు గుసగుసలు .అలాగే ధర్మపురి శాసనసభ బిజెపి టికెట్ విషయంలో నిరాశ చెందినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు విశ్వాసనీయ సమాచారం. చర్చలు ఫలించడంతో నేడో,రేపు ఢిల్లీలోని మల్లికార్జున కార్గే నివాసంలో ఆయన కమలాన్ని వీడి కాంగ్రెస్లోకి చేరుతారనే సమాచారం. అలాగే తన కుమారునికి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్, తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇస్తామని..? హామీ ఇవ్వడంతో, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం. ముహూర్తం ఖరారు అయితే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీని కూడాకలుస్తారని సమాచారం.ఏది ఏమైనా బిజెపి పార్టీకి ఈ చేరికతో తెలంగాణలో ఎదురు దెబ్బెనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
