అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్ రూరల్: మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో వర్షాలు పడకపోవడం వల్ల హార్వెస్టర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం గ్రామాలలో ఐకెపి సెంటర్లను ప్రారంభం చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ, వడ్లను నేరుగా రైస్ మిల్లర్లకు పదహారు వందల నుండి, పద్దెనిమిది వందలకు తక్కువ ధరతో అమ్ముకుంటున్నామని కొత్తపల్లి గ్రామానికి చెందిన కలవేన రాఘులు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం గ్రామాలలో ఐకెపి సెంటర్లను ప్రారంభంచేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.

పత్తి రైతులు మాత్రం వర్షాలు లేక పత్తి చేనులు ఎండిపోయి పత్తి దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
