జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్,లోకి…

రేవంత్ రెడ్డి సమక్షంలో పెగడ రమేష్ అశోక్ గౌడ్ చేరిక.

విజయరమణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులు.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రోజుకో ఎత్తుగడలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎవరు ఏ క్షణాన ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారనే విషయం తెలియక,తెలిసిన నివారించలేక, తలలు పట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్  భాను ప్రసాద్ రావు ముఖ్య అనుచరులు అయినా పెగడ రమేష్, రేగుంట అశోక్ గౌడ్ , మండల సత్యనారాయణ రెడ్డి,కారు పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు.పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం రోజు హైదరాబాదులో తన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునున్నారు……

 

జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం కాంగ్రెస్ లో చేరిక

పెద్దపల్లి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్, కటికనపల్లి రవికుమార్, అశోక్ గౌడ్, పహిముద్దీన్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి ఇక్బాల్ తో,పాటు పలువురు ఆసంఘ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్స్  సంఘo అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్.